నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:11

కారుణ్య నియమాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్నల్

విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేస్తూ గత సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయినవారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం, దానికి అనుగుణంగా ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభు త్వం ఉపసంహరించుకు న్నది.

దీంతో కారుణ్య నియామ కాలకు వెసులుబాటు లభిం చింది. గత ప్రభుత్వం లో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్ళీ పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

ఇందుకు అనుగుణంగా ఏకీకృత యూనిఫాం పాలసీని రూపొందించా లంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ తాజా గా,ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కారుణ్య నియామ కం కోసం దరఖాస్తు చేసుకు న్నవారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా ఫార్మాట్ ను రూ పొందించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోడానికి వారికి అవకాశం కల్పించా లని సూచించారు.

చనిపోయిన ఉద్యోగుల పిల్లల/జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్థోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్త ర్వుల్లో సీఎండీ పేర్కొ న్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:10

భారీగా పెరిగిన టెట్ పరీక్ష ఫీజు

రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజు ను భారీగా పెంచింది. గతం లో ఒక పేపర్‌ రాస్తేరూ.200 రుసుం ఉండగా, దాన్నిరూ. వెయ్యికి పెంచింది.

రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుం ఉండగా, దాన్ని రూ.2,000కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు https:// schooledu.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిం ది. మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకో వచ్చని పేర్కొంది...

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:02

బీసీల డిమాండ్ల సాధనకై బిసి సామాజిక న్యాయ యాత్ర

•బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండకు చేరుకున్న సామాజిక న్యాయ యాత్ర

•ఘన స్వాగతం పలికిన బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా దాంట్లో భాగంగా నల్గొండకు ఈరోజు విచ్చేయడం జరిగింది.

వారికి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీల డిమాండ్లు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనాభా తమాషా ప్రకారం సీట్లను కేటాయించాలని లేనియెడల బీసీల సత్తా ఏందో రాబోయే లోక్సభ ఎన్నికల్లో చూపిస్తామని అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం అన్నారు.

గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ్ నరేష్ గౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు కొంపల్లి రామన్న గౌడ , శివకృష్ణ ,పొగాకు రవికుమార్ యాదవ్ ,నిమ్మను కోటి శివకుమార్ ,పనస శ్రీకాంత్ కళ్యాణి, మనీషా ,లక్ష్మి ,ప్రసన్న ,మహాలక్ష్మి ,మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు .

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 08:48

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు.

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల 15 హైద రాబాద్ లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు.

గత ఆరు రోజులుగా మద్యం కుంభకోణంలో విచారించిన ఈడీ మరింత కీలక సమా చారం. రాబట్టేందుకు ఆమె కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే లిక్కర్ స్కాం కు సంబంధిం చిన అన్ని వివరాలు బయ టకు వస్తాయని ఈడీ భావిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య, ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికి వస్తానని, బాధ పడవద్దు అంటూ ధైర్యం చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 08:47

నేడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత పై ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థు లపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమో దం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్ర నేతలతో అభ్యర్థుల ఎంపి కపై మంతనాలు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 08:46

రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి..40 మందికిపైగా మృతి

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. స్థానిక అతి పెద్ద సంగీత కచేరీ హాలు లోకి ప్రవేశించిన దుండ గులు పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 40 మందికి పైగా మరణించారని, దాదా పు 100 మంది గాయపడ్డా రని రష్యా వార్తా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

మొత్తం 6, వేల మందికిపైగా సామర్థ్యమున్న క్రాకస్‌ సిటీ హాలులో రష్యాలోనే ప్రము ఖ బ్యాండ్‌ అయిన ‘పిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమం జరుగు తోంది,రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాది మిర్ పుతిన్ దీంతో అభి మానులు పెద్దఎత్తున పోటెత్తారు.

ఇదే అదనుగా దుండగులు రెచ్చిపోయారు. తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. దీంతో మంటలు చెలరే గాయి. ఇది ఉగ్రవాద చర్యేనని రష్యా దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

దాడిలో అనేక మంది ముష్కరులు పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తు న్నాయి. బాంబుల దాడిలో మంటల తీవ్రతకు క్రాకస్‌ సిటీ హాలు పైకప్పు కుప్పకూ లినట్టు తెలుస్తుంది. మృతు ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికా రులు వెల్లడించారు.

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 07:56

ఉత్కంఠ పోరులో బెంగళూరు పై చెన్నై సూపర్ కింగ్ తొలి విజయం

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే విజ‌యం సాధించింది. 174 ప‌రుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొం దింది.

తొలి బంతినుంచే బౌండరీల తో దూకుడుగా ఆడిన సీఎస్‌కే… వికెట్లు పడుతున్న రన్‌రేట్ పడిపోకుండా ఆడింది. దీంతో 4 వికెట్ల నష్టానికి 18.4 ఓవర్లలోనే టార్గెన్‌ను చేధించింది.

రుతురాజ్ గైక్వాడ్ (15), రచిన్ రవీంద్ర (37), అజింక్యా రహానే (27), డారిల్ మిచెల్ (22), శివమ్ దూబే 34 నాటౌట్, రవీంద్ర జడేజా 25 నాటౌట్ ఆకట్టుకున్నారు.

ఇక ఆర్సీబీతో బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాళ్ చరో వికెట్ దక్కించుకున్నారు.

అంతక ముందు ఆర్సీబీ బ్యాటింగ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్, మ్యాక్స్‌వెల్ వరుసగా డకౌట్ అయ్యి నిరాశపర్చారు. కోహ్లీ 21 పరుగులు, కెమరాన్ గ్రీన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు.

ఇక అనుజ్ రావత్ (48) పరుగులతో చెలరేగగా.. దినేష్ కార్తీక్ (38- నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నా డు. సీఎస్‌కే బౌటర్లలో దీపక్ చాహర్ ఒక వికెట్ దక్కించు కోగా… ముస్తాఫిజుర్ రెహ మాన్ 4 వికెట్లతో మెరిసా డు. కాగా, 174 పరుగల టార్గెట్‌తో చెన్నై జట్టు బరిలోకి దిగనుంది.

ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో అరుదైన రికా ర్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ చరిత్రలోనే 12 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కోహ్లీ 21 పరుగులు చేశాడు.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 11:08

హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం..

ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు.

ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు.

తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు.

రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డిసిపి రోహిణి ప్రియదర్శిని.

చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి.. ఎవరు నువ్వు అని తల్లికూతుళ్లు అడగ్గా..

హైదరాబాద్‌ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు.

తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లీకూతుర్లు. తుపాకీ, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు.

ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. మాస్క్‌, హెలిమెంట్, చేతితో కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లీకూతుర్ని బెదిరించి.. బంగారం, నగదు కొట్టేయ్యాలని ప్లాన్ చేశారు.

గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. జుట్టుపట్టుకొని ఒక దొంగను ఇంటిబయట ఈడ్చిపడేసింది.

అతని దగ్గర తుపాకీ లాక్కోని చితకొట్టింది. తల్లికితోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు. తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లికూతుళ్లు.

ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్‌కే జైన్ భార్య. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఆర్ కే జైన్ మేడ్చల్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు. మరోవైపు తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 10:08

నేటి నుంచి ఐపీఎల్‌ టోర్నీ.. మొదటి పోరులో చెన్నైతో బెంగళూరు ‘ఢీ’

చెన్నై వేదికగా నేడు ఐపీఎల్‌ 17వ సీజన్‌ మొదలు కానుంది.

గత ఏడాదిలాగే 10 జట్లు 74 మ్యాచ్‌లతో టోర్నీ సిద్ధం కాగా.... ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్‌లకే బీసీసీఐ షెడ్యూల్‌ ప్రకటిం చింది.

గత కొద్ది రోజులుగా భారత టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించిన ఫ్యాన్స్‌ రాబోయే దాదాపు ఎనిమిది వారాల పాటు బౌండరీల గురించే చర్చిం చడం ఖాయం.

చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని

ఐపీఎల్‌–2024కు రంగం సిద్ధమైంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది.

గత రెండు సీజన్ల తరహా లోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ ల చొప్పున ఆడుతుంది. ఐపీఎల్ సమరానికి సర్వం సిద్ధంచేశారు. లీగ్‌ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి.

తుది షెడ్యూల్‌ ప్రకటించ కపో యినా... మే 26న ఫైనల్‌ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు విజేత గా నిలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్‌ సాధించింది

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:25

Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) రాత్రంతా ఈడీ (ED) ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు..

అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)కు తరలించనున్నారు.

స్పెషల్ సీబీఐ కోర్టు (CBI Court) జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.

10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్‌ను ఈడీ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

కేంద్ర పారామిలటరీ బలగాలను ఢిల్లీ పోలీసు (Delhi Police) యంత్రాంగం రంగంలోకి దించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నేడు ధర్నాలు నిర్వహించే అవకాశం అవకాశం ఉంది.